Monday, 28 January 2019

చరణ్ – ఎన్టీఆర్ ‘ఆర్ఆర్ఆర్’లో బాలీవుడ్ హీరోయిన్ !

చరణ్ – ఎన్టీఆర్ కాంబినేషన్ లో దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో రాబోతున్న భారీ మల్టీస్టారర్ ‘ఆర్ఆర్ఆర్’. ఇప్పటికే మొదటి షెడ్యూల్ ను పూర్తి చేసుకుని ప్రస్తుతం ఈ చిత్రం రెండవ షెడ్యూల్ ను జరుపుకుంటుంది. ఈ షెడ్యూల్ లో చెయ్యబోయే సన్నివేశాల్లో ఎన్టీఆర్ రఫ్ లుక్ లో కనిపిస్తాడట. ఇక ఈ చిత్రంలో నటించే హీరోయిన్లు వీళ్ళే అంటూ ఇప్పటికే కీర్తి సురేష్ , రష్మిక మండన్నా , కియరా అద్వానీ ఇలా పలువురి హీరోయిన్ పేర్లు సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేశాయి. అయితే ఈ వార్తల పై చిత్ర బృందం మాత్రం ఏమి స్పందిచలేదు.
అయితే తాజాగా సినీ వర్గాల సమాచారం ప్రకారం ఈ భారీ మల్టీస్టారర్ లో ఓ హీరోయిన్ పాత్రకు బాలీవుడ్ హీరోయిన్ పరిణితి చోప్రా ను చిత్ర బృందం సంప్రదించారని వార్తలు వస్తున్నాయి. మరి ఇది నిజామా అబద్దమా అనే విషయం పై తర్వలోనే క్లారిటీ రానుంది.




ఇక ఈ చిత్రాన్ని తెలుగుతో పాటు ఇతర భాషల్లో విడుదల చేస్తుండడంతో ఆయా ఇండస్ట్రీలో గుర్తింపు తెచ్చుకున్న నటీనటులను ఈ చిత్రంలోకి తీసుకుంటున్నారు. పైగా ‘బాహుబలి’ తరవాత రాజమౌళి చేస్తున్న సినిమా కావడం, ఇద్దరు స్టార్ హీరోలు కలిసి నటిస్తుండటంతో ఈ సినిమా పై ఆరంభం నుండి భారీ అంచనాలు నెలకొన్నాయి. భారీ బడ్జెట్ తో డివివి ఎంటర్ టైన్మెంట్స్ పతాకం ఫై డివివి దానయ్య ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా కీరవాణి సంగీతం అందిస్తున్నారు.

No comments:

Post a Comment