Monday, 28 January 2019

పాపం అఖిల్ ఎంత ట్రే చేసినా ఇంతేనా..?.

‘మిస్టర్ మజ్ను’ మంచి అంచనాల మధ్య నిన్న విడుదలై మిక్సడ్ రివ్యూస్ కే పరిమితమైంది. దాంతో ఈ చిత్రం కలెక్షన్స్ ఫై తీవ్ర ప్రభావం పడింది. మొదటి రోజు తెలుగు రాష్ట్రాల్లో 3.24కోట్ల షేర్ ను రాబట్టి పర్వాలేదనిపించినా.. రెండవ రోజు 2.50 కోట్ల షేర్ ను మాత్రమే కలెక్ట్ చేసిందంటే.. ఈ చిత్రం పరిస్థితి అర్ధం చేసుకోవచ్చు. మొత్తానికి ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రం రెండు రోజుల్లో 7.40 కోట్ల షేర్ ను రాబట్టుకుంది.


వెంకీ అట్లూరి దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం.. కథ మరియు సెకెండ్ హాఫ్ విషయంలో మాత్రం ఆకట్టుకోలేకపోయింది. సెకెండ్ హాఫ్ లో హీరోయిన్ హీరోన్ని రిజెక్ట్ చేసే సన్నివేశాలు, అసలు హీరోను అంతగా ఎందుకు రిజెక్ట్ చేస్తోందో అనే విషయంలో బలమైన కారణాలు లేకపోవడం, హీరోయిన్ క్యారెక్టరైజేషన్ లో సరైన క్లారిటీ లేకపోవడం వంటి అంశాలు సినిమాకి బలహీనతలుగా నిలిచి.. సినిమా మిక్స్ డ్ టాక్ కారణమయ్యాయి.


No comments:

Post a Comment