Monday, 28 January 2019

వచ్చే సంక్రాంతికి ఎఫ్ 3 ! |cinesarathi news

సంక్రాంతి అల్లుళ్లుగా ‘F2’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన వెంకటేష్, వరుణ్ తేజ్‌లు థియేటర్స్‌లో నవ్వులు జల్లు కురిపిస్తూ కాసుల వర్షం కురిపిస్తున్నారు. వినయ విధేయ రామ, కథానాయకుడు, పేటా చిత్రాలతో పోటీ పడుతూ జనవరి 12న విడుదలైన ఈ మూవీ క్లీన్ హిట్‌గా మిగతా చిత్రాలను పక్కకు నెట్టేసింది. పటాస్, సుప్రీమ్, రాజా ది గ్రేట్ చిత్రాలతో హ్యాట్రిక్ విజయాలను అందుకున్న యువ దర్శకుడు అనిల్ రావిపూడి ‘F2’ చిత్రంతో మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు. ఇక ‘F2’ బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో ఈ చిత్రానికి కొనసాగింపుగా ‘F3’ చిత్రాన్ని సీక్వెల్ తీయబోతున్నట్టు ప్రకటించారు అనిల్ రావిపూడి. అయితే ‘F3’లో వెంకటేష్, వరుణ్ తేజ్‌లతో మరో హీరోని యాడ్ చేయబోతున్నారట. అభిమానులు నా నుంచి ఆశిస్తున్నట్టుగానే ‘ఎఫ్ 3’ సినిమా ఉంటుంది.


No comments:

Post a Comment