Monday, 28 January 2019

ర‌వితేజ డిస్కో రాజా ! |cinesarathi news

రీసెంట్‌గా అమ‌ర్ అక్బ‌ర్ ఆంటోని చిత్రంతో ప్రేక్ష‌కుల ముందుకు వచ్చిన రవి తేజ పెద్దగా ఆకట్టు కోక పోవడంతో, ప్ర‌స్తుతం ‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’, ‘ఒక్క క్షణం’ చిత్రాల ద‌ర్శ‌కుడు వీఐ ఆనంద్ ద‌ర్శ‌క‌త్వంలో సినిమా చేసేందుకు సిద్ధ‌మ‌య్యాడు ర‌వితేజ‌. ఈ రోజు ఆయ‌న బ‌ర్త్‌డే సంద‌ర్భంగా చిత్ర టైటిల్ లోగో విడుద‌ల చేశారు. గ‌త కొన్నిరోజులుగా ప్ర‌చారం అవుతున్న డిస్కోరాజా అనే టైటిల్‌నే చిత్రానికి ఫిక్స్ చేశారు. లోగో పోస్ట‌ర్ అభిమానుల‌ని ఆక‌ట్టుకుంటుంది.
ఈ చిత్రాన్ని ఎస్‌.ఆర్‌.టి. ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై రామ్‌ తాళ్లూరి నిర్మించ‌నున్నారు. చిత్రంలో ముగ్గురు కథానాయికలకు చోటుండ‌గా ‘నన్ను దోచుకుందువటే’ ఫేమ్‌ నభా నటేశ్‌ను ఓ నాయికగా, ‘ఆర్‌ఎక్స్‌ 100’ ఫేమ్‌ పాయల్‌ రాజ్‌పుత్‌ను మరో నాయికగా ఎంపిక చేశారు. మూడో నాయికను త్వరలో ఎంపిక చేయనున్నారు. బటర్ ఫ్లై రూపంలో తెలుగు .. ఇంగ్లిష్ కలిసిన లెటర్స్ తో టైటిల్ ను ఆకర్షణీయంగా డిజైన్ చేశారు. టైటిల్ క్రింద రివైండ్ .. ఫార్వార్డ్ .. కిల్ అంటూ కొన్ని సంకేతాలతో సినిమాపై ఆసక్తిని పెంచే ప్రయత్నం చేశారు. త్వరలోనే ఈ సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లనున్నారు.




No comments:

Post a Comment