బిగ్ బాస్ ఫేమ్ దీప్తి సునైన, మెహేబుబ్ దిల్ సే డాన్స్ ప్రస్తుతం యూట్యూబ్ ప్రేక్షకుల మనసులను దోచుకుంటుంది. ఈ జంట స్టెపులేసిన, ధనుష్ మారి 2 “రౌడీ బేబీ ” కవర్ సాంగ్ యూట్యూబ్ ట్రెండింగ్ వీడియో సాంగ్ లలో ఫోర్త్ ప్లేస్ దక్కించుకోవడం విశేషం. కేవలం అప్లోడ్ చేసిన ఏడు ఎనిమిది గంటల్లోనే 1.5 మిలియన్ వ్యూవర్స్ కి రీచ్ అవ్వడం గొప్పే అని చెప్పుకోవాలి.
ఈ సాంగ్ లో మెహేబుబ్ దిల్ సే, దీప్తి సునైన తమ డాన్స్ తో ఆకట్టుకోగా… ఈ సాంగ్ కి డైరెక్షన్, సినిమాటోగ్రఫీ మరియు ఎడిటింగ్ బాధ్యతలు సమర్ధవంతగా నిర్వహించి వినయ్ శన్ ముక్ ఆకట్టుకున్నాడు. ‘ఇన్ఫినిటం నెట్ వర్క్ సొల్యుషన్స్’ టాలెంట్ ఉన్న న్యూ కమర్స్ ను, టెక్నీషియన్స్ ను ఎంకరేజ్ చేస్తూ, వారి ఆశయాలకు వారధిగా నిలుస్తున్నందుకు ఆ సంస్థను అభినందించాలి.
No comments:
Post a Comment