Sunday, 3 February 2019

క్లాసిక్ హార‌ర్ చిత్రంగా `అమావాస్య` -స‌చిన్ జోషి |cinesarathi news


చాలా గ్యాప్ తరువాత మళ్లీ ‘అమావాస్య’ అని వస్తున్నారు ?
నేను చాలా కాలంగా హార‌ర్ సినిమా చేయాల‌ని ఎదురుచూస్తున్నాను. అలాంటి స‌మ‌యంలో భూష‌ణ్ ప‌టేల్ నాకు ఈ స్క్రిప్ట్ గురించి చెప్పారు. నా గ‌త చిత్రాల‌కు ఇది పూర్తి భిన్న‌మైన సినిమా. అమావాస్య ఓ క్లాసిక్ హార‌ర్ మూవీ. తెలుగులో హార‌ర్ చిత్రాల‌కు మంచి ఆద‌ర‌ణ దొరుకుతున్న స‌మ‌యంలో మంచి కాన్సెప్ట్‌తో సినిమా చేయ‌డం ఆనందంగా ఉంది.
ఈ సినిమా ప్రోమోలు చూస్తుంటే.. ఇది పూర్తిగా హారర్ నేపథ్యంలో సాగుతున్నట్లు అనిపిస్తోంది ?
అవునండి.. ఇది పూర్తిగా హర్రర్ నేపథ్యంలోనే సాగుతుంది. సినిమాలోని కొన్ని హర్రర్ ఎలిమెంట్స్ ప్రేక్షకులను థ్రిల్ చేస్తాయి. అలాగే డైరెక్టర్ భూషణ్ పటేల్ స్క్రీన్ ప్లే కూడా చాలా బాగుంటుంది. సింగిల్ వర్డ్ లో చెప్పాలంటే.. అమావాస్య ఒక క్లాసిక్ హర్రర్ ఫిల్మ్.
ఇప్ప‌టి వ‌ర‌కు చాలా హార‌ర్ సినిమాలు వ‌చ్చాయి క‌దా ?
ఫస్ట్ రెగ్యూలర్ గా వచ్చే హర్రర్ సినిమాలా ఉండదు ఈ సినిమా. మెయిన్ గా సినిమాలో కనిపించే వి.ఎఫ్.ఎక్స్ చాలా కొత్తగా, వైవిధ్యంగా ఉంటాయి. అన్నిటికి మించి ‘అమావాస్య‌’లో ఆకట్టుకునే గొప్ప స్టోరీ ఉంది. సినిమాకే స్టోరీ హైలెట్ గా నిలుస్తోంది. అదేవిధంగా ఇంటర్నల్ గా సినిమాలో ఎంతవరకు రాని ఒక యూనిక్ స్క్రీన్ ప్లే ఉంటుంది. ఈ సినిమా క్లైమాక్స్ ప్రేక్షకులను థ్రిల్‌ చేస్తుంది.


hyderabadfilmclub  Screening Schedule  February 2019 Screenings





No comments:

Post a Comment