Sunday, 3 February 2019

పేరు మార్చుకోబోతున్న వివాదాల టైటిల్ ! |cinesarathi news

పేరు మార్చుకోబోతున్న వివాదాల టైటిల్ !


టైటిల్ వివాదంలో చిక్కుకున్న నిఖిల్ ‘ముద్ర’, ఎట్టకేలకూ టైటిల్ నే మార్చుకోబోతుంది. కొత్త టైటిల్ ను రేపు మధ్యాహ్నం 12 గంటలకు విడుదల చేయనున్నారు. నూతన దర్శకుడు టి.ఎన్ సంతోష్ దర్శకత్వంలో రాబోతున్న ఈ చిత్రం ఇప్పటికే నిర్మాంతర కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. అయితే విడుదల తేదీ విషయంలో కూడా ఇప్పటికే పలు వాయిదాలు పడింది.



కాగా తాజాగా ఈ చిత్ర విడుదల ఫై కూడా క్లారిటీ వచ్చింది. మార్చి చివర్లో ఈ చిత్రాన్ని విడుదల చేసేలా ప్లాన్ చేస్తున్నారు దర్శక నిర్మాతలు. కోలీవుడ్ సూపర్ హిట్ మూవీ ‘కనితన్’ కి రీమేక్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో నిఖిల్ సరసన లావణ్య త్రిపాఠి కథానాయికగా నటిస్తుంది ఒరిజినల్ వెర్షన్ ను డైరెక్ట్ చేసిన టి యెన్ సంతోష్ నే ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు.

అయితే చాలా సార్లు విడుదల వాయిదా పడిన ఈ చిత్రాన్ని అనుకున్న సమయానికి విడుదల చేస్తారో లేదా మరో కొత్త తేదీని ప్రకటిస్తారో లేదో చూడాలి. అలాగే నిఖిల్ ఈ సారైనా ఈ తమిళ రీమేక్ రూపంలో విజయం అందుకుంటాడో లేదో చూడాలి. సామ్ సిఎస్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని ఠాగూర్ మధు విడుదల చేస్తున్నారు.



hyderabadfilmclub  Screening Schedule  February 2019 Screenings





No comments:

Post a Comment