Monday, 11 February 2019

నియోజకవర్గానికి రూ.100కోట్లు : కేఏ పాల్ సంచలనం

ప్రజాశాంతి పార్టీ వ్యవస్థాపకుడు కేఏ పాల్ మాట్లాడుతూ తెలంగాణలో తన కార్యకర్తలకు కీలక సూచన చేశారు. తాను ఎలక్షన్ రూల్ బ్రేక్ చేయనని.. ఎన్నికల గురించి మాట్లాడనని.. బుధవారం సాయంత్రమే ప్రచారం ముగిసిందన్నారు. అయితే ఓటేసే ముందు ప్రార్థించి ఓటెయ్యండని పాల్ సైన్యానికి పిలుపనిచ్చారు. నగరంలో ప్రెస్‌క్లబ్‌లో మీడియాతో మాట్లాడిన ఆయన.. లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి మరో కీలక ప్రకటన చేశారు. ప్రజాశాంతి పార్టీ రాబోయే లోక్ సభ ఎన్నికల్లో పోటి చేయనుందని తెలిపారు. అభ్యర్థులను ఎంపిక చేస్తామని.. 17 లోక్ సభ నియోజకవర్గాల్లోనూ తమ పార్టీ పోటీ చేస్తుందని పాల్ వ్యాఖ్యానించారు.

No comments:

Post a Comment