2019 2019 Union Budget Live: ఐటీ పెంపు, రైతులకు రూ.6 వేలు.. బడ్జెట్ హైలెట్స్ ఇవే!
Highlights
ఆదాయపన్ను పరిమితి రూ.5 లక్షలకు పెంపు
ఐదెకరాల్లోపు రైతులకు ఏటా రూ.6 వేల సాయం
అసంఘటిత రంగ కార్మికులకు నెలకు రూ.3 వేల ఫించను.
ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం శుక్రవారం తుది బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది. త్వరలోనే సార్వత్రిక ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ప్రజాకర్షక మధ్యంతర బడ్జెట్‌ను పీయూష్ గోయల్ ప్రవేశపెట్టారు. ఇప్పటి వరకూ సంస్కరణల దిశగా అడుగులేసిన మోదీ సర్కారు.. మరోసారి అధికారంలోకి రావడమే లక్ష్యంగా చివరి బడ్జెట్‌లో జనాకర్షక పథకాలను ప్రవేశపెట్టింది. ఓట్ అకౌంట్ బడ్జెట్ అయినప్పటికీ.. రైతాంగం, ఉద్యోగులు, పేదలు, అసంఘటిత కార్మికులకు ప్రయోజనం చేకూర్చేలా కేంద్రం వరాలు గుప్పించింది. 2019-20 బడ్జెట్‌లోని ముఖ్యాంశాలు..
✔ వేతన జీవులకు ఊరట. ఆదాయపన్ను పరిమితి రూ.5 లక్షలకు పెంపు. సెక్షన్ 80సీ పరిమితిని రూ.1 లక్ష నుంచి రూ.1.5 లక్షలకు పెంచారు. రూ.6.5 లక్షల్లోపు వార్షికాదాయం ఉన్నవారు ప్రావిడెంట్ ఫండ్స్, ఈక్విటీల్లో పెట్టుబడి పెడితే పన్నులు కట్టనక్కర్లేదు. 3 కోట్ల కుటుంబాలకు లబ్ధి.
✔ పీఎం కిసాన్ సమ్మాన్ నిధి ఏర్పాటు. ఐదెకరాల లోపు రైతులకు ఏటా రూ.6 వేల రూపాయలు అందిస్తాం. 12 కోట్ల రైతు కుటుంబాలకు లబ్ధి చేకూరనుంది. డిసెంబర్ 1, 2018 నుంచి ఈ పథకం అమల్లోకి వస్తుంది. రూ. 2 వేలు చొప్పున మూడు వాయిదాల్లో చెల్లింపు. నేరుగా బ్యాంక్ ఖాతాల్లోకి నగదు బదిలీ. ఈ పథకం కోసం ఏటా రూ.75 వేల కోట్లు ఖర్చు.
✔ ప్రధాని శ్రమ యోగి మంధన్ పేరిట అసంఘటిత రంగంలోని కార్మికుల కోసం పెన్షన్ పథకం. నెలకు రూ.100 చెల్లిస్తే 60 ఏళ్ల తర్వాత నెలకు రూ.3 వేలు. పది కోట్ల మందికి లబ్ధి చేకూరనుంది.
✔ ఇళ్ల కొనుగోలు దారులను జీఎస్టీ నుంచి మినహాయించే విషయమై త్వరలోనే నిర్ణయం.
✔ పన్నులు లేకుండా గ్రాట్యూటీ పరిమితి రూ.20 లక్షలకు పెంపు. ఓవరాల్‌గా గ్రాట్యూటీని రూ.30 లక్షలకు పెంపు.
hyderabadfilmclub Screening Schedule February 2019 Screenings
No comments:
Post a Comment