Tuesday, 13 November 2018

ఘనంగా ప్రసాద్ లాబ్స్ లో 'పార్టీ' మూవీ ఆడియో లాంచ్‌



అమ్మ క్రియేష‌న్స్ ప‌తాకం పై టి. శివ నిర్మించిన‌ చిత్రం పార్టీ. వెంక‌ట్ ప్ర‌భు ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో జై, రెజీనా క‌సాంద్రా, ర‌మ్య‌కృష్ణ‌, స‌త్య‌రాజ్‌, నాజ‌ర్‌, సంచిత‌శెట్టి, చంద్ర‌న్‌, సంప‌త్‌రాజ్‌, శివ‌, చంద్ర‌న్ త‌దిత‌రులు న‌టిస్తున్నారు. ప్రేమ్‌జి అమ‌ర‌న్ ఈ చిత్రానికి మ్యూజిక్ అంద‌జేశారు. ఈ చిత్రం షూటింగ్ ప‌నులు పూర్తి చేసుకుని. సోమ‌వారం హైద‌రాబాద్ ప్ర‌సాద్‌ల్యాబ్స్ లో ఆడియో లాంచ్ జ‌రిగింది. 

సంద‌ర్భంగా పాత్రికేయుల స‌మావేశంలో...ప్రొడ్యూస‌ర్ టి. శివ మాట్లాడుతూ... ఈ ప్రొడక్ష‌న్‌లో ప‌నిచేయ‌డం నాకు చాలా గ‌ర్వంగా ఉంది. ఒక మంచి చిత్రాన్ని తీశాన‌ని ఆనంద‌ప‌డుతున్నాను. డైరెక్ట‌ర్ చాలా బాగా తీశారు. ఇక‌ముందు కూడా నేను ఈ డైరెక్ట‌ర్‌తో క‌లిసి సినిమాలు చెయ్య‌డానికి రెడీగా ఉన్నాను. మీరంద‌రూ ఈ సినిమాని చూసి ఎంజాయ్ చేస్తార‌ని ఆశిస్తున్నాను అన్నారు.




link



No comments:

Post a Comment