Monday 28 January 2019

20 కోట్ల మార్కెట్ లేని హీరోకి 40 కోట్లు అవసరమా ?

ఒకప్పుడు మినిమమ్ గ్యారెంటీ హీరోగా పేరు తెచ్చుకున్న యాక్షన్ హీరో గోపిచంద్ కి గత కొన్ని సినిమాలుగా అస్సలు కలిసి రావడం లేదు. వరుస ప్లాప్ లతో ఎప్పటినుంచో బాక్సాఫీస్ వద్ద ఘోరంగా ఫెయిల్ అవుతున్నాడు. దాంతో గోపీచంద్ మార్కెట్ ఓ చిన్న హీరోకి ఉన్నంత కూడా లేదు. ప్రస్తుతం గోపీచంద్ పరిస్ధితి అంత దారుణంగా పడిపోయింది. కానీ ఈ విషయాలను ఏం పట్టించుకోని నిర్మాత గోపిచంద్ కొత్త చిత్రానికి భారీగా ఖర్చు పెడుతూ.. రోజురోజుకి బడ్జెక్ట్ పెంచుకుంటూ పోతున్నారు. ఆయనే నిర్మాత అనిల్ సుంకర.
తమిళ్ డైరెక్టర్ తిరు దర్శకత్వంలో తన 26వ చిత్రంలో గోపీచంద్ నటిస్తున్నారు. కాగా ఇటివలే ఈ చిత్రం షూటింగ్ జైసల్మేర్ లోని ఇండో -పాక్ బోర్డర్ పరిసర ప్రాంతాల్లో మొదలయ్యింది. ఈ లాంగ్ షెడ్యూల్లో యాక్షన్ సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు. ఈ సన్నివేశాల కోసం భారీగానే సమర్పించనున్నారు నిర్మాత. దాంతో మొదట ఈ చిత్రం కోసం 32కోట్ల బడ్జెట్ ను అనుకున్నది కాస్త, ఇప్పుడు 40 కోట్లు దాటేలా ఉంది. ఇరవై కోట్ల మార్కెట్ కూడా లేని హీరోకి, నలభై కోట్లు అవసరమా ? ఇంతకి ఇంత పెద్ద మొత్తం రికవరీ కావాలంటే సినిమాకు బ్లాక్ బ్లాస్టర్ టాక్ రావాల్సిందే. వచ్చినా ఇంతవరకు గోపీచంద్ సినిమా 40 కోట్లు కలెక్ట్ చేసిన పాపాన పోలేదు. దీని బట్టి అనిల్ సుంకర్ కి ఈ చిత్రం కూడా నష్టాల్నే తెచ్చేలా ఉంది. విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని ఏకే ఎంటర్టైమెంట్స్ పతాకం ఫై అనిల్ సుంకర నిర్మిస్తున్నారు పా..పం.




No comments:

Post a Comment